Pslv 61: రేపే పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం.. కౌంట్ డౌన్ ప్రారంభించిన ఇస్రో

by B.Srinivas |

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పీఎల్ఎల్వీ సీ-61 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన రీశాట్-బీను నింగిలోకి పంపించనున్నారు.

Pslv 61: రేపే పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం.. కౌంట్ డౌన్ ప్రారంభించిన ఇస్రో
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Isro) ఆదివారం పీఎల్ఎల్వీ సీ-61 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్-బీ)ను నింగిలోకి పంపించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 5:59 నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టనుండగా దీనికి సంబంధించి శనివారం ఉదయం 7:59కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయితే సరిహద్దులు, తీర ప్రాంతాల్లో దేశ నిఘా వ్యవస్థ బలోపేతం అవుతుంది. అనుమానాస్పద కదలికను, చొరబాట్లను ఈ ఉపగ్రహం సులభంగా గుర్తించగలదు. అంతేగాక ఈ శాటిలైట్ నుంచి 24 గంటలూ విభిన్న చిత్రాలను పొందొచ్చు. దీని ద్వారా రియల్ టైం సమాచారం లభిస్తుంది కాబట్టి భద్రతా వ్యవస్థ బలోపేతం అవనుంది. పీఎల్ఎల్వీ సీ61 17 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మిషన్‌ను ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది ఇస్రోకు 101వ ప్రయోగం కావడం గమనార్హం.

Next Story