- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Russia-Ukraine: ఉద్యోగాల పేరుతో రష్యా యుద్ధంలోకి యూపీ యువకులు

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన విషాద ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరిని మోసపూరితంగా యుద్ధంలోకి తోసేసిన వ్యహారం వెలుగులోకి వచ్చింది. యూపీలోని అజంగఢ్, మౌ జిల్లాలకు చెందిన దాదాపు డజను మంది యువకులు ఉద్యోగం లభిస్తుందనే భ్రమలో బాంబుల మోత, తుపాకీ కాల్పుల మధ్య ఇరుక్కున్నారు. గతేడాది ఎన్నో ఆశలతో రష్యాకు బయలుదేరిన ఈ రెండు జిల్లాలకు చెందిన 13 మందిలో ఇద్దరు యుద్ధభూమిలో మరణించినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు గాయాలపాలై ఇంటికి తిరిగి రాగా, మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకూ తెలియకపోవడం విషాదం. వారందరినీ రష్యాలో సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు, వంటవారిగా ఉద్యోగం, నెలకు రూ. 2 లక్షల జీతం ఇప్పిస్తామని హామీ ఇచ్చి తీసుకెళ్లారు. కానీ, తీరా అక్కడికి వెళ్లాక వారిని బలవంతంగా యుద్ధభూమిలో పంపించారు.