అస్సాం ఎన్నికల కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ

by Malleboina Mahesh |

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

అస్సాం ఎన్నికల కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ (Screening Committee) అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు శనివారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ (K.C. Venugopal) అధికారిక ప్రకటన విడుదల చేశారు. అస్సాంలో గెలుపు గుర్రాలను అన్వేషించే బాధ్యతను నేరుగా ప్రియాంకకు అప్పగించడం ద్వారా, ఈ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

అస్సాం తో పాటు ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్ ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను (Special screening committees) ప్రకటించింది. ఈ నలుగురు సభ్యుల కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి, స్థానిక నాయకత్వంతో చర్చించి అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తాయి. అస్సాంలో బీజేపీని ఢీకొనేందుకు ప్రియాంక గాంధీ నేతృత్వంలోని ఈ కమిటీ ఎలాంటి వ్యూహాలతో అభ్యర్థులను ఎంపిక చేస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story