- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక గాంధీకి AICC పగ్గాలు!
ఏఐసీసీ పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇవ్వబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఏఐసీసీ పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇవ్వబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుస ఎన్నికల ఓటముల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీకి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఈ విషయమై సోనియా గాంధీకి లేఖలు కూడా రాసినట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత బలపడిందని చెబుతున్నారు.
ఇందిరా గాంధీని తలపించే రూపురేఖలు, ఇటీవలి కాలంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ నాయకత్వంతో కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటి ఆలోచనే లేదని కొట్టి పడేస్తున్నారు.






