ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ

by Naga Rani Yarlagadda |

ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు సీఎం రేఖా గుప్తాను ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. బిహార్ లో ఎన్నికల ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగివచ్చిన ప్రియాంక.. దేశ రాజధానిలో కాలుష్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా.. నాయకులంతా కలిసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజధాని నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇలాంటి భయంకర పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా మద్దతివ్వాలని రాజకీయ నేతల్ని కోరారు. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు, పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులతో పాటు.. తాము కూడా ఈ విష వాయువునే పీల్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. దేశ రాజధానిలో గడిచిన రెండు వారాల్లో గాలి నాణ్యత బాగా క్షీణించినట్లు నివేదించింది. అనేక ప్రాంతాల్లో AQI 400 పాయింట్లు దాటిపోయినట్లు వెల్లడించింది.

Next Story