ఉపాధి హామీ పథకం పేరు మారిస్థే ప్రయోజనం ఏంటి.. ప్రియాంక గాంధీ

by Ajay Maddhiboyina |

మ‌హాత్మాగాంధీ ఉపాధి హామీ ప‌థ‌కం పేరును పూజ్య బాబు గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంగా మారుస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఉపాధి హామీ పథకం పేరు మారిస్థే ప్రయోజనం ఏంటి.. ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హాత్మాగాంధీ ఉపాధి హామీ ప‌థ‌కం పేరును పూజ్య బాబు గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంగా మారుస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ప‌థ‌కం పేరు మారిస్తే ఏం ప్ర‌యోజ‌నం ఉంటుందో అర్థం కావ‌డం లేద‌న్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులు, ప‌త్రాల‌పై పేర్లు మార్చ‌డం ద్వారా ఖ‌ర్చు పెరుగుతుంది త‌ప్ప లాభం లేద‌న్నారు. మ‌రోవైపు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది సైతం ఉపాధి హామీ ప‌థ‌కం పేరు మార్చ‌డంపై విమ‌ర్శ‌లు చేశారు.

ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించడానికి, గాంధీ పేరును అగౌర‌వ‌ప‌ర్చ‌డానికి ఇది కేవ‌లం డైవ‌ర్ట్ చేయడానికి త‌ప్ప మ‌రి దేనికీ ప‌నిచేయ‌ద‌ని అన్నారు. వందేమాత‌రం 150 సంవ‌త్స‌రాలపై చ‌ర్చ ప్ర‌జ‌ల‌కు ఏది చ‌రిత్ర‌.. ఏది వాట్సాప్ వెర్ష‌న్ అనేది అర్థం చేసుకోవ‌డానికి స‌హాయ‌ప‌డింద‌ని పేర్కొన్నారు. అందుకే వాట్సాప్ ను న‌మ్మేవారు గాంధీ కుటుంబంపై చిరాకు ప‌డ‌తారని తెలిపారు. నిజ‌మైన చరిత్ర తెలిసిన‌వారు గాంధీ కుటుంబం చేసిన సేవ‌ల‌ను ఎప్పుడూ గుర్తిస్తార‌ని అన్నారు. ఇదిలా ఉంటే ఉపాధి హామీ ప‌థ‌కం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేద‌ల‌కు ఏడాదికి 100 రోజుల ప‌ని క‌ల్పిస్తారు. 18ఏళ్లు నిండినవాళ్లు ఈ ప‌థ‌కానికి అర్హులు.

Next Story