- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyanka Chopra : తగలబడిన ప్రియాంక చోప్రా ఇల్లు!
అమెరికా(USA) లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు(Fire In Los Angeles), రేపిన మంటల్లో అనేక మంది ఇండ్లు దగ్థమైపోగా..హలీవుడ్ ప్రముఖుల ఇండ్లు కూడా కాలిపోయినట్లుగా సమాచారం. భారతీయ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్‌లో రేగిన కార్చిచ్చు(House Burnt Down)లో తగలబడినట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(USA) లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు(Fire In Los Angeles), రేపిన మంటల్లో అనేక మంది ఇండ్లు దగ్థమైపోగా..హలీవుడ్ ప్రముఖుల ఇండ్లు కూడా కాలిపోయినట్లుగా సమాచారం. భారతీయ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్‌లో రేగిన కార్చిచ్చు(House Burnt Down)లో తగలబడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కార్చిచ్చు మృతుల సంఖ్య 16కు చేరింది. అనేక జంతువులు కూడా మంటల్లో మరణించాయి.
గాలులు వేగంగా వీస్తుండటంతో మంటలు ఒకచోట నుంచి మరోచోటుకి వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు రేపిన మంటలను ఆర్పేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ వేగమైన గాలులతో మంటలను అర్పే పనుల్లో జాప్యం జరుగుతోంది.
మరో భారతీయ నటి నోరా ఫతేహీ, జో బైడన్ కుమారుడు ఆర్నాల్డ్, లిబ్రోన్ జేమ్స్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వంటి మరి కొందరి ప్రముఖుల ఇండ్లు కూడా మంటల్లో చిక్కుకున్నాయన్న ప్రచారం చోటుచేసుకుంది.
మంటల్లో 13లక్షల కోట్ల ఆస్తులు అహుతయ్యాయని, 56వేల ఇండ్లు మంటల బారిన పడగా, 21వేల ఇండ్లు దగ్థమైనట్లుగా వార్తలు వెలువడ్డాయి. 3లక్షల మంది ఇండ్లు ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.






