- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Oscars: ఆస్కార్ వేదికపై ఫ్రీ పాలస్తీనా నినాదం
ఆస్కార్ అవార్డుల సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్పానిష్ యాక్టర్ జేవియర్ బార్డెమ్ పాలస్తీనాకు సంఘీభావంగా తన సందేశం ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: 98వ అకాడమీ అవార్డుల వేడుక మరోసారి అంతర్జాతీయ అంశాలకు వేదికగా నిలిచింది. అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డుల సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్పానిష్ యాక్టర్ జేవియర్ బార్డెమ్ పాలస్తీనాకు సంఘీభావంగా తన సందేశం ప్రకటించారు. ఈ ఘటన ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ప్రదానం చేసేందుకు మనదేశానికి చెందిన స్టార్ నటి ప్రియాంక చోప్రాతో కలిసి వేదికపైకి వచ్చిన జేవియర్ బార్డెమ్ 'పాలస్తీనాకు విముక్తిని అందించండి.. యుద్ధాన్ని ముగించండి' అని పిలుపునిచ్చారు. తన కోటుపై 'నో టు వార్' పిన్ ధరించిన జేవియర్, 'నో టు వార్, ఫ్రీ పాలస్తీనా' అనగా, పక్కనే నిలబడ్డ ప్రియాంక చోప్రా అనుకోకుండా వచ్చిన ఈ నినాదంతో మౌనంగా నవ్వుతూ ఉండిపోయారు. జేవియర్ ప్రకటనకు వేదిక ముందున్న అతిథుల నుంచి హర్షధ్వానాలు లభించాయి. ఆ తర్వాత ఇద్దరు నటులు కలిసి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును నార్వేజియన్ మూవీ సెంటిమెంటల్ వాల్యూకు అందించారు. జేవియర్ బార్డెమ్ గతంలో సైతం ఆస్కార్ వేదికగా యుద్ధానికి సంబంధించిన నినాదాలు చేశారు. 2003లో జరిగిన ఇరాక్ యుద్ధ సమయంలోనూ ఇదే తరహా పిన్‌ను తన దుస్తులపై ధరించి తన వైఖరిని స్పష్టం చేశారు.






