- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్ లో మరోసారి హింస.. మంటల్లో మాజీ ప్రధాని తండ్రి ఇళ్లు దగ్ధం
బంగ్లాదేశ్ (Bangladesh)లోని మరోసారి హింస (Violence) చెలరేగింది.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh)లోని మరోసారి హింస (Violence) చెలరేగింది. నిరసనకారులు (Protesters) రెచ్చిపోయి, మాజీ ప్రధాని షేక్ హసీనా (Former Prime Minister Sheikh Hasina) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) స్మారక చిహ్నం, ఇంటికి నిప్పంటించారు. ఢాకా (Dhaka)లో నిరసనకారులు మరోసారి ఆందోళనల బాట పట్టారు. బంగ్లాదేశ్ లోని అవామీ లీగ్ పార్టీ (Awami League party)ని దేశం నుంచి బహిష్కరించాలనే (expulsion) డిమాండ్ (Demand)తో నిరసనలు చేపట్టారు. '
దీంతో ఢాకాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే నిరసనకారులు ఢాకాలో ఉన్న ముజిబుర్ రెహమాన్ ఇల్లును ముట్టడించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి, పెద్ద ఎత్తున సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేగాక ఆ ఇంటికి నిప్పు (Burnt) పెట్టి బయటికి వచ్చారు. దీంతో భారీగా ఆస్తి నష్టం (Loss) నెలకొన్నదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో(Social Media) చక్కర్లు (Rounds) కొడుతున్నాయి. ఒకవైపు బంగ్లాదేశీయులను ఉద్దేశించి షేక్ హసీనా ఆన్ లైన్ వీడియో ప్రసంగం చేస్తుండగానే.. మరోవైపు ఆందోళనకారులు ఈ హింసకు పాల్పడ్డారు.
దీంతో ఆమె ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) పాలనను వ్యతిరేకంగా ప్రతిఘటనలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లక్షలాది మంది ప్రాణాలను బలికొని సంపాదించుకున్న జాతీయ జెండా (National Flag), రాజ్యాంగం (Constitution), స్వాతంత్రాన్ని (freedom) నాశనం చేసే శక్తి వారికి లేదని, వారు ఒక భవనాన్ని (Building) కూల్చివేయవచ్చు కానీ చరిత్ర (History)ను కాదని అన్నారు. చరిత్ర ప్రతి దానికి ప్రతీకారం తీర్చుకుంటుందని మండిపడ్డారు. కాగా మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు (Cases), బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు (attacks on minorities) నిరనసగా గురువారం అవామీ లీగ్ పార్టీ ఆందోళనలకు పిలుపినిచ్చింది. ఈ నేపథ్యంలో హింస చెలరేగడం సంచలనంగా మారింది.






