- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2025: పదేళ్లలో విదేశీ జోక్యం లేకుండా జరిగే బడ్జెట్ సెషన్ ఇదే..!
బడ్జెట్ సమావేశాలు ప్రజల్లో కొత్త విశ్వాసం, శక్తిని నింపుతాయని.. 140 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్ సమావేశాలు ప్రజల్లో కొత్త విశ్వాసం, శక్తిని నింపుతాయని.. 140 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ (Union Budget) సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోని ప్రతి పేదలు, సామాన్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పటికీ ఇలానే ఉండాలని ప్రార్ధించా. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు అధికారం అప్పగించారు.మూడోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్ర అభివృద్ధి వైపు మిషన్ మోడ్ లో ముందుకు సాగుతున్నాం. ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో దూసుకెళ్తున్నాం. కొత్త విధానాల పైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. మహిళలను గౌరవించడం, మహిళలకు సమానహక్కులు, మతఘర్షణలు జరగకుండా తీసుకొచ్చే చట్టాలకు ప్రాముఖ్యం ఇస్తాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఈ సమావేశాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. వేగవంతమైన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణ(reform), పనితీరు(perform), పరివర్తన(transform) ముఖ్యం.’ అని మోడీ అన్నారు.
సమగ్ర అంశాలపై చర్చ
పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నానని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశంలో విజన్ ఆఫ్ డెవలపింగ్ ఇండియాను బలోపేతం చేసేందుకు ఎంపీలు సహకరించాలని కోరారు. యువ ఎంపీలకు ఇది ఒక సువర్ణావకాశమని.. సభలో వారి చురుకైన భాగస్వామ్యం, అవగాహన అసరమన్నారు. బడ్జెట్ సమావేశాలు దేశ ఆకాంక్షలను తీరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పదేళ్ల కాలంలో పార్లమెంట్ సెషన్‌కు ముందు ఈసారే విదేశీ జోక్యం కనిపించలేదని విపక్షాలను ఉద్దేశించి చురకలు ఉంటించారు. విదేశీ వనరుల నుండి అవాంతరాలు సృష్టించే ప్రయత్నం జరగకపోవడం బహుశా ఇదే మొదటి పార్లమెంటరీ సమావేశం అని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.






