- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డార్జిలింగ్ వంతెన ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, రాష్ట్రపతి
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో శనివారం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ (Darjeeling) జిల్లాలో శనివారం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో మిరిక్ ప్రాంతంలోని డుడ్హియా ఐరన్ వంతెన (Dudhia iron bridge) కూలిపోయింది. ఈ వంతెన సిలిగురి, మిరిక్, కుర్సియాంగ్ ప్రాంతాలను కలిపే కీలక రహదారి. దీంతో అనేక ప్రాంతాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అధికారుల ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు మంది మృతిచెందగా, మరికొందరు అదృశ్యమయ్యారు. వారి కోసం రక్షణ బృందాలు, NDRF, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘోర విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తన ట్వీట్ లో "డార్జిలింగ్‌లో వంతెన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర బాధాకరం.
తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో డార్జిలింగ్ పరిసర ప్రాంతాలలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. బాధితులకు సాధ్యమైనంత సాయం అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. అలాగే రాష్ట్రపతి ముర్ము మృతులకు సంతాపం తెలుపుతూ.. తన ట్వీట్ లో "పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన విషాదకరమైన ప్రాణనష్టం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రక్షణ, సహాయ కార్యకలాపాలు విజయవంతం కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అని ప్రెసిడెంట్ ముర్ము రాసుకొచ్చారు.






