Mahakumbh Mela:నేడు మహాకుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోడీ.. ఏర్పాట్లు సిద్ధం!

by Jakkula.Mamatha |

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలాహలంగా కొనసాగుతోంది

Mahakumbh Mela:నేడు మహాకుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోడీ.. ఏర్పాట్లు సిద్ధం!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలాహలంగా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. ఈ విధంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో నేడు(బుధవారం) భారత ప్రధాన మంత్రి(Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) మహాకుంభమేళాకు రానున్నారు.

ఈ రోజు ఉదయం పత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్ చేరుకోనున్న పీఎం నరేంద్ర మోడీ.. అక్కడి త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) మంగళవారం రాత్రే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఉదయం 10గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్తారు. 11 గంటలకు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసి.. అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీ(Delhi)కి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రధాని మోడీ రాకతో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story