కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

by Dishafeatures2 |
కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ ఫాస్ట్ ఎక్స్ రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ భారీ ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఈ రైలు.. గూడ్స్ రైలును ఢీకొనటంతో.. 3 స్లీపర్ కోచ్ లు వదిలి..మిగిలిన అన్ని బోగీలు పట్టాలు తప్పాయి. కాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా వివరాలు, చేపట్టిన సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనలో 300కు పైగా ప్రయాణికులు గాయపడ్డట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed