- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని, ఇవాళ అర్దరాత్రి నుంచి దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ జరగబోతున్నదని, జీఎస్టీ 2.0 సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరగబోతున్నదని , రాష్ట్రాలన్ని అభివృద్ధిలో దూసుకుపోతాయని చెప్పారు. ఈ జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగబోతోందని చెప్పారు. కొత్త జీఎస్టీతో ప్రజల డబ్బు ఆదా అవుతుందని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. జీఎస్టీకి ముందు పన్నుల విధానం గందరగోళంగా ఉండేది. రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరయనున్నాయని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడులు ప్రవాహం పెరుగుతుందన్నారు.
నాగరిక్ దేవోభవ.. నినాదంతో ముందుకు:
రాష్ట్రాల మధ్య వస్తు రవాణా కూడా ఇకపై చౌకగా మారనుందని మోడీ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తువులు పంపాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదన్నారు. రేపటి నుంచి కేవలం జీఎస్టీలో 5 శాతం, 18 శాతం పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయని, నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను విధిస్తున్నామన్నారు. మధ్యతరగతి వారికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బొనాంజా లభించిందని చెప్పారు. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది. వీరికి చాలా ఆకాంక్షలు ఉన్నాయి. ఈ సంస్కరణలు ఈ వర్గానికి ప్రోత్సాహకరం అన్నారు. అలాగే పర్యాటక రంగానికి, కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. హోటల్స్ సేవలపై కూడా జీఎస్టీ తగ్గించామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రయోజనం చేకూరేలా మార్పులు చేశామన్నారు. నాగరిక్ దేవోభవ.. నినాదంతో మేం ముందుకెళ్తున్నామని చెప్పారు.
స్వదేశీ మంత్రం:
దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉందని ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలతోనూ, రాష్ట్రాలతోనూ చర్చించిన తర్వాతే ఇంత పెద్ద సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో పన్నులు మరింత సరళంగా మారబోతున్నాయన్నారు. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను ఉండబోతున్నదని చెప్పారు. అలాగే టీవీ, ఫ్రీజ్, స్కూటర్, ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుందన్నారు. ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రయోజనం చేకూరేలా మార్పులు చేశామన్నారు. ఇప్పటికే రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చామని చెప్పారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పండని పిలుపునిచ్చారు.






