- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Mdi : రేపు 4 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) రేపు తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్(Chhathisgahr) ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) రేపు తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్(Chhathisgahr) ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి (Pro-Active Governance and Timely Implementation) ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి.
కాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పురోగతి, ఒడిశాలో రూ.18,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, తెలంగాణలో రూ.56,000 కోట్ల ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌లో గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.






