మావోయిస్టులపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మావోయిస్టుల(Maoist Party)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టులపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల(Maoist Party)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో పర్యటించారు. రాజధాని రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన ‘శాంతి శిఖర్‌’ భవన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల ఛత్తీస్‌గఢ్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పారు. గతంలో మావోయిస్టుల హింస కారణంగా ఛత్తీస్‌గఢ్‌ వెనుకబాటుతనాకి గురైందని అన్నారు. భారతదేశం ఇటీవలే ఉగ్రవాదుల వెన్నెముకను విరిచింది.. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు కూడా మావోయిస్టుల హింస నుంచి విముక్తి లభించిందని వెల్లడించారు. ఇక నుంచి ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు.

ఈ మార్పునకు కారణం ఛత్తీస్‌గఢ్ ప్రజలే అని అన్నారు. ఛత్తీస్‌గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఒక పెద్ద లక్ష్యానికి నాంది అని ప్రధాని మోడీ అన్నారు. 2047 నాటికి, భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశం దార్శనికతను సాధించడంలో ఛత్తీస్‌గఢ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు, కొత్తగా నిర్మించిన అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అసెంబ్లీ నుండి వచ్చే ప్రతి ఆలోచన ప్రజాసేవ స్ఫూర్తిని, అభివృద్ధి పట్ల నిబద్ధతను మరియు భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో విశ్వాసాన్ని ప్రతిబింబించాలని అన్నారు. మనం భారతదేశాన్ని నిర్మించాలి, అభివృద్ధి చెందే దిశగా ఛత్తీస్‌గఢ్‌కు పునాది వేయాలని పిలుపునిచ్చారు.

Next Story