ED దాడులపై ప్రధాని MODI సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భారత్ మోడల్‌(India Model)ను యావత్ ప్రపంచం స్వీకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పేర్కొన్నారు.

ED దాడులపై ప్రధాని MODI సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ మోడల్‌(India Model)ను యావత్ ప్రపంచం స్వీకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఓ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ వేదికలపై భారత్ అత్యున్నత స్థాయికి వెళ్తోందని అన్నారు. మన దేశం నేడు ఐదో అతిపెద్ద ఎకానమీగా ఎదిగిందని తెలిపారు. ఐఎమ్ఎఫ్(IMF) లెక్కల ప్రకారం భారత్ జీడీపీ(India GDP) రెట్టింపు అయిందని అన్నారు. జీడీపీ రెట్టింపు అంటే లెక్కల మార్పు మాత్రమే కాదని.. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు అని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దడం, సురక్షితం చేయడంలో భారత్(Bharat) నేడు ప్రపంచంలోనే కీలకంగా నిలుస్తోందని అన్నారు.

అందరి భాగస్వామ్యాన్ని ఇండియా ఆకాంక్షిస్తోందని తెలిపారు. విపత్తుల సమయంలో మౌలిక వసతులకు ముప్పు కలుగుతోందని.. అటువంటి సమయంలో మౌలిక వసతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల సమయంలో అన్ని దేశాలు కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్(Bharat) ప్రయత్నాలకు 100 దేశాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. దేశ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఒకప్పుడు గ్రామాల్లో బ్యాంకులు ఉండేవి కావు.. ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌(Online Banking)తో దేశంలోని ప్రతీ ఇంటికి చేరినట్లు చెప్పారు. జనాన్ని దోచుకున్న వారు దోచుకున్న మొత్తాన్ని ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఈడీ దాడుల ద్వారానే రూ.22 వేల కోట్లు బయటపడ్డాయని అన్నారు. ఆ డబ్బును కూడా దోపిడీకి గురైన వారి చెంతరే చేరుస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఎవరు పడితే వారుండేవారు.. ఇప్పుడు అనేక శాఖలను విలీనం చేసి పరిపుష్టం చేసినట్లు తెలిపారు. దేశ ప్రాధాన్యతలు, వనరులను ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు.

Next Story