- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Modi: నిబంధనలు ప్రజలను వేధించడానికి కాదు.. ఇండిగో సంక్షోభం వేళ మోడీ సంచలన వ్యాఖ్యలు
ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండిగో సంక్షోభం (Indigo Crisis) కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఈ అంశంపై స్పందించారు. నిబంధనలు వ్యవస్థను మెరుగుపరచడానికే తప్ప ప్రజలను వేధించడానికి కాదని అన్నారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని GMC బాలయోగి ఆడిటోరియంలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యల వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో పంచుకున్నారు. ప్రజలను వేధించేందుకు నిబంధనలు వాడకూడదని మోడీ చెప్పారన్నారు. ఎన్డీయే కూటమిలోని ప్రధాన పార్టీల ఎంపీలు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన అపూర్వ విజయంపై ప్రధాని మోడీకి ఎన్డీయే నేతలు ఘన సన్మానం చేశారు.
రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్:
ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని బలోపేతంతో పాటు ఫ్లోర్ స్ట్రాటజీని క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా డిసెంబర్ 11న ప్రధాని మోడీ అన్ని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎంపీలకు ప్రత్యేక విందును నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి సమిష్టి రాజకీయ రోడ్ మ్యాప్ ను బలోపేతం చేయడం, త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై సన్నాహక వ్యూహాలు ఈ భేటీలు చర్చించే అవకాశం ఉంది.






