- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని నోట ‘నోరూరించే బంగినపల్లి మామిడి’ మాట.. ఏమన్నారంటే..?
దేశంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన, ఎండల నుంచి రక్షణకు, దేశీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటర్ బాటిల్ (మంచినీళ్ల బాటిల్) వెంట తీసుకెళ్లాలని ప్రధాని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండల నుంచి ఉపశమనం కోసం వివిధ రాష్ట్రాల్లో స్థానికంగా లభించే సాంప్రదాయ పానీయాలను, అలాగే దేశంలోని ప్రముఖ మామిడి పండ్ల రకాలైన సువర్ణ రేఖ, బంగినపల్లి, నీలమ్, తోతాపురి, హిమ్సాగర్ వంటి రకాల మామిడి రసాలను (మ్యాంగో జ్యూస్) ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలిపారు.
కేరళ స్విమ్మింగ్ క్లబ్ పై ప్రశంసలు..
కేరళలోని 'ఆలువా' ప్రాంతానికి చెందిన ఒక స్విమ్మింగ్ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యంగా దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు/ వ్యక్తులకు) సైతం ఎంతో ఓపికతో ఈత నేర్పిస్తున్న క్లబ్ నిర్వాహకుల కృషిని ఆయన కొనియాడారు. ఇలాంటి సేవా దృక్పథం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. చివరగా.. భారతదేశ పురాణ కాలం నాటి అపూర్వ సంపద, సంస్కృతి గురించి మాట్లాడిన ప్రధాని.. చోళ రాజుల కాలం నాటి చారిత్రక విశిష్టతను గుర్తుచేశారు. ఆ కాలంలో తామర పత్రాలపై (తామర ఆకులపై) లిఖించిన అపూర్వ గ్రంథాలు, వాటి విశిష్టత, నాటి సాంకేతికతను వివరించారు. మన పూర్వీకుల జ్ఞాన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.






