YogaDay2025: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) నేథప్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కీలక పిలుపునిచ్చారు.

YogaDay2025: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) నేథప్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. యోగా డేలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ అంతర్జాతీయ యోగా డేను అత్యంత ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. యోగాకు దేశ ప్రజల నుంచి ప్రత్యేక ఆదరణ ఉంటుందని అన్నారు. కాగా, ఈనెల 21న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో యోగా డేను ‘యోగాంధ్ర’గా నామకరణం చేసి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ఆ రోజు ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించే కార్యక్రమ సన్నాహాలను సీఎం చంద్రబాబు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆర్కే బీచ్‌రోడ్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానాలను సందర్శించారు. అనంతరం నోవాటెల్‌ హోటల్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారతీయ వారసత్వ సంపదగా వచ్చిన యోగా వల్ల అందరికీ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన ప్రధాని.. దీనిని ఐక్యరాజ్యసమితికి చెప్పి ‘జూన్‌ 21’ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసి పదేళ్లు పూర్తయిందని గుర్తుచేశారు.

Next Story