- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. జ్యోతిర్లింగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. జ్యోతిర్లింగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
by Ramesh Naini |
గుజరాత్‌లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమ్‌నాథ్ ఆలయాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమ్‌నాథ్ ఆలయాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపమైన సోమ్‌నాథుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఓంకార మంత్రజపంలో ప్రధాని మోడీ పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
అనంతరం ‘సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆకర్షణీయమైన డ్రోన్ షోను ప్రధాని తిలకించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వం, సోమ్‌నాథ్ ఆలయ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన డ్రోన్ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సోమ్‌నాథ్ ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ప్రతీకగా నిలుస్తోందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Next Story






