- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prime Minister Modi : డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)ఈ నెల 13న ప్రయాగ్ రాజ్ (Prayagraj)సందర్శించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)ఈ నెల 13న ప్రయాగ్ రాజ్ (Prayagraj)సందర్శించనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జనవరి 13నుంచి ఫిభ్రవరి 26వరకు జరిగే మహా కుంభమేళ ఏర్పాట్లను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. రైల్వే శాఖ చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నూతన రైల్వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పలు ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు.
గంగానదిపై నిర్మించిన కొత్త వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గంగా మాత పూజ, హారతి కూడా చేస్తారు. అంతేకాకుండా డిజిటల్ కుంభ్ ప్రదర్శనను కూడా ఆయన పరిశీలిస్తారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు యూసీ సీఎం యోగి ఆదిత్యనాధ్ పర్యవేక్షిస్తున్నారు. పుష్య మాసంలోని పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మొదలయ్యే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగియనుంది.






