- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ, ఎమ్మెల్యేలపై దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ
పశ్చిమబెంగాల్‌లో శనివారం నుంచి ఆదివారకు వరకు కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో శనివారం నుంచి ఆదివారకు వరకు కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలిచేందుకు స్థానిక బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్, కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం జల్పైగురి ప్రాంతంలో ఆయన పర్యటిస్తుండగా స్థానిక టీఎంసీ నేతలు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటలు పెరగడంతో ఎంపీ, ఎమ్మెల్యే పై దాడి చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ దాడిలో ఎంపీ ఖాగెన్ ముర్ము తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు సహాయంతో ఎంపీ, ఎమ్మెల్యే, బీజేపీ నేతలు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే పై జరిగిన ఈ దాడిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది.
వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న ఎంపీని, ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని టీఎంసీ గుండాలు దాడి చేయడం దారుణమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఎంపీని రక్తమోచ్చెలా కొట్టడంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. "పశ్చిమ బెంగాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రజలకు సేవ చేస్తున్నందుకు సిట్టింగ్ ఎంపీ మరియు ఎమ్మెల్యేతో సహా మా పార్టీ సహచరులపై దాడి జరిగిన విధానం పూర్తిగా భయంకరమైనది. ఇది టిఎంసి ప్రభుత్వ అసమర్థతను, రాష్ట్రంలో పూర్తిగా దయనీయమైన శాంతిభద్రతల పరిస్థితిని హైలైట్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టిఎంసి ఇటువంటి సవాలుతో కూడిన పరిస్థితిలో హింసకు పాల్పడటం కంటే ప్రజలకు సహాయం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ కార్యకర్తలను ప్రజల మధ్య పనిచేయడం కొనసాగించాలని, కొనసాగుతున్న సహాయక చర్యలకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను అని ప్రధాని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.






