PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మహా శివరాత్రి విషెస్.. స్పెషల్ వీడియో ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-27 11:46:46  IST  )

మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదిన వేడుకలను దేశ వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మహా శివరాత్రి విషెస్.. స్పెషల్ వీడియో ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదిన వేడుకలను దేశ వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించి ఆ మహాదేవుడి దర్శనానికి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే మహా శివరాత్రి (Maha Shivratri)ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ వీడియో (Special Video)ను పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవదేవుడు పరమేశ్వరుడికి అంకితం చేయబడిన పవిత్ర పండుగ మహా శివరాత్రి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ దివ్య సందర్భంలో మీ అందరికీ సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చెందిన భారతదేశం (India) కోసం సంకల్పాన్ని బలపరచాలని మేము కోరుకుంటున్నాం. సర్వత్ర శివా! అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అయితే, ఆ వీడియోలో మహా శివుడి విజువల్స్ బ్యాక్‌డ్రాప్‌లో చూపిస్తూ.. ఆయన గొప్పతనాన్ని ప్రధాని వివరిస్తున్న మాటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Next Story