- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని ‘మన్ కీ బాత్’లో కరీంనగర్, హైదరాబాద్ ప్రస్తావన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసారం చేసిన 128వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కరీంనగర్, హైదరాబాద్ నగరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసారం చేసిన 128వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కరీంనగర్, హైదరాబాద్ నగరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా సాధించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కరీంనగర్ హస్తకళలపై ప్రధాని..
ఇటీవల జీ-20 సదస్సులో విదేశీ అతిథులకు అందించిన బహుమతుల వివరాలను వెల్లడించిన ప్రధాని మోదీ, వాటిలో కరీంనగర్ కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా చర్చించారు. జపాన్ ప్రధానికి బహుకరించిన సాంప్రదాయ వెండి బుద్ధుడి విగ్రహం, ఇటలీ ప్రధానికి అందించిన పూల ఆకారంలో తయారైన వెండి అద్దం-ఇవన్నీ కరీంనగర్‌కు చెందిన ప్రతిభావంతులైన కళాకారులు రూపొందించినవేనని మోడీ తెలిపారు. భారతీయ హస్తకళలు ప్రపంచ వేదికపై మెరుగైన గుర్తింపు పొందుతున్నాయని ఆయన గర్వంగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో లీప్ ఇంజిన్ MRO సౌకర్యం ప్రారంభం
ఇటీవల హైదరాబాద్‌లో లీప్ ఇంజన్ MRO (మెయింటెనెన్స్, రీపేర్, ఓవర్‌హాల్) ఫెసిలిటీని ప్రారంభించిన విషయాన్ని కూడా ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సౌకర్యంతో విమానాల మరమ్మత్తు, సంరక్షణ రంగంలో భారత్ సత్తా చాటుతుందని, ఇది భారత నూతన తరం ప్రతిభను ప్రతిబింబించే ఆవిష్కరణాత్మక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






