భారత్‌లో మరో అద్భుత ఘట్టం: 5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

by Disha Web Desk 19 |
భారత్‌లో మరో అద్భుత ఘట్టం: 5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించారు. దేశంలో 5జీ సేవలు ముందుగా మెట్రో నగరాల్లో అందుబాటులోకి రానుండగా.. రెండేళ్ల అనంతరం దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి రానుంది. తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, ప్రస్తుత 4జీ సేవలతో పోలిస్తే.. 7-10 రెట్ల డేటా వేగంతో 5జీ పనిచేస్తుంది. తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లో కూడా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అహ్మదాబాద్, చంఢీగడ్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్ నగర్, లక్నో, కోల్‌కతా, ముంబై, పూణే నగరాల్లో తొలి దశలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.



Next Story

Most Viewed