ఈశాన్య రాష్ట్రాలు అంటే కాంగ్రెస్‌కు ఏటీఎంలు: ప్రధాని మోడీ ఫైర్

by Disha Web Desk 19 |
ఈశాన్య రాష్ట్రాలు అంటే కాంగ్రెస్‌కు ఏటీఎంలు: ప్రధాని మోడీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నెల 27న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. చుమౌకెడిమా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు ఏనాడు నాగాలాండ్ వైపు చూడలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నాగాలాండ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారానే నడిపిందని అన్నారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

తమ హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో సాంకేతిక సహాయంతో అవినీతిని అరికట్టామని చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలుగా చూసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అలా కాకుండా నాగాలాండ్‌లో వేలాది మంది కుటుంబాలకు ఉచిత రేషన్ ఇవ్వడంతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తోందని చెప్పారు. కాగా నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీపీపీ కలిసి పోటీ చేస్తున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed