ఆస్ట్రేలియా కాల్పులు.. ఖండించిన ప్రధాని మోడీ

by Muthe.Rajitha |

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో ఆదివారం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా కాల్పులు.. ఖండించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో ఆదివారం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. 50 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. కాగా ఆస్ట్రేలియా కాల్పుల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదుల దాడిపై దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపిన ప్రధాని మోడీ... మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని, టెర్రరిజంపై జరిపే పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేసారు. కాగా కాల్పులకు తెగబడ్డ దుండగుల్లో ఒకరు హతం కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ ఈ దాడిని "ఈవిల్ యాంటీసెమిటిజం"గా అభివర్ణించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Next Story