- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం
ప్రధాని మోడీ (PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా లండన్ వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) రెండు రోజుల యూకే పర్యటన కోసం లండన్ (London) చేరుకున్నారు. ఈ సందర్భంగా యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోడీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణ, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరపనున్నారు. కాగా, ఇది మోడీ యూకేకు నాల్గవ పర్యటన.
అలాగే, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే బ్రిటన్ మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ ఒప్పందం 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తోలు, పాదరక్షలు, దుస్తుల ఎగుమతులపై పన్నుల తొలగింపు, బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు కూడా ఇందులో ప్రతిపాదించబడ్డాయి. ఈ ఒప్పందంపై మే 6న చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.
ప్రధాని మోడీ తన పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ పర్యటన ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుందని, శ్రేయస్సు, ఉద్యోగ సృష్టి, వృద్ధిపై దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. భారత్-యూకే స్నేహం ప్రపంచ పురోగతికి కీలకమని, యూకేలోని భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తనను కదిలించిందని, వారి అభిమానం హృదయాన్ని తాకిందని తెలిపారు.






