PM Modi: క్షమాపణలు కోరిన ప్రధాని నరేంద్ర మోడీ.. విషయం ఏంటంటే?

by Prasad Jukanti |

ప్రధాని నరేందర్ మోడీ క్షమాపణలు కోరారు.

PM Modi: క్షమాపణలు కోరిన ప్రధాని నరేంద్ర మోడీ.. విషయం ఏంటంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) క్షమాపణలు కోరారు. ఇవాళ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Bhopal) లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) కు మోడీ దాదాపు 15-20 నిమిషాలు ఆలస్యంగా హజరయ్యారు. అయితే తన ఆలస్యానికి గల కారణాని తెలియజేస్తూ సదస్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు (PM apologizes) తెలియజేశారు. రాష్ట్రంలో 10,12 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం నేను రాజ్ భవన్ నుంచి బయలుదేరే సమయం ఒక్కటే. అప్పుడు నేను బయటకు వస్తే భద్రతా కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు వెళ్లిన తర్వాత తాను రాజ్ భవన్ నుంచి బయలుదేరారనని అందువల్ల ఈ సదస్సుకు ఆలస్యంగా రావాల్సి వచ్చింది. మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు కోరుతున్నాన్నారు.

భారత్ మాటలకే పరిమితం కాదు:

అనంతరం సదస్సులో మాట్లాడిన ప్రధాని భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లో చూపిస్తోందన్నారు. సౌరశక్తిలో భారత్ సూపర్‌ పవర్‌గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం కీర్తించిందని అన్నారు. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థ వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. భారత్ ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంక్ సైతం చెప్పిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయన్నారు.

Next Story