- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tuvalu : ఆ దేశంలోనే తొలి ATM.. ప్రారంభించిన ప్రధాని
మనకు డబ్బులు అవసరం అయితే మన వీధి చివర్లో ఉన్న ఏటీఎం(ATM) నుంచి, లేదా పక్క వీధి.. అది కూడా లేదంటే పక్క ఊర్లో ఉన్న ఏటీఎం నుంచి ఈజిగా డబ్బులు డ్రా చేసుకుంటాం.

దిశ, వెబ్ డెస్క్ : మనకు డబ్బులు అవసరం అయితే మన వీధి చివర్లో ఉన్న ఏటీఎం(ATM) నుంచి, లేదా పక్క వీధి.. అది కూడా లేదంటే పక్క ఊర్లో ఉన్న ఏటీఎం నుంచి ఈజిగా డబ్బులు డ్రా చేసుకుంటాం. కాని ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆ దేశంలో ఇప్పటివరకు ఒక్క ఏటీఎం కూడా లేదు. ఈ మధ్యనే దేశంలోనే తొలి ఏటీఎం(First ATM)ను ప్రారంభించారు. అది కూడా స్వయంగా దేశ ప్రధాని వచ్చి రిబ్బన్ కట్ చేశారు. ఇంతకీ ఏ దేశం అనుకుంటున్నారా? అదే తువాలు(Tuvalu) దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడిన దేశం. కేవలం 11,200 జనాభా, 10 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న ఈ దేశంలో ఏప్రిల్ 15న తొలి ఏటిఏం, ఆ దేశ ప్రధాని ఫెలెటి టియో(Feleti leo) ప్రారంభించారు. ఇది దేశ చరిత్రలో గొప్ప మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.
కాగా మరో 10 ఏళ్లలో తువాలు దేశం కనుమరుగు కానుంది. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్(Global Warming) బలి అవబోతున్న తొలి దేశంగా చెప్పుకోవచ్చు. సముద్రమట్టాలు పెరిగి ఇప్పటికే 40 శాతం ఈ దేశ భూభాగం సముద్రంలో మునిగిపోయింది. ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దంలోనే తువాలు పూర్తిగా సముద్రంలో మునిగి అదృశ్యం కానుంది.






