రాష్ట్రపతి ముర్ము కొత్త BMW కారుకి GST మినహాయింపు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-04 11:17:55  IST  )

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొసం కొనుగోలు చేస్తున్న కొత్త కారుకు లగ్జరీ వస్తువుల జాబితాలో ఉన్న జీఎస్టీతో పాటు, అన్ని టాక్స్ లు మినహించారు.

రాష్ట్రపతి ముర్ము కొత్త BMW కారుకి GST మినహాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన GST కౌన్సిల్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లగ్జరీ వస్తువులు, వాహనాలు, వినియోగంపై కేంద్ర జీఎస్టీ ని పెంచింది. అయితే తాజా నిర్ణయంతో పాటు, రెగ్యులర్ జీఎస్టీ విధింపులోను రాష్ట్రపతి ముర్ము (President Murmu)_ కొత్త BMW కి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు GST కౌన్సిల్ ఇంటిగ్రేటెడ్ GST, పరిహార సెస్సు నుంచి మినహాయింపు కల్పిస్తూ కేంద్ర ఆదేశాలు ఇచ్చింది. రూ. 3.66 కోట్ల విలువైన ఆర్మర్డ్ సెడాన్ (Armored sedan) ప్రస్తుత మెర్సిడెస్-బెంజ్ S600 పుల్‌మ్యాన్ లిమోసిన్ స్థానంలో అందుబాటులోకి రాణుంది.

ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం (Bulletproof vehicle) కావడం దీని ప్రత్యేకత స్వభావం కారణంగా పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే భారత ప్రథమ పౌరురాలు అయిన ద్రౌపది ముర్ము రక్షణ కోసం ఉపయోగించే వాహనం వాణిజ్య లగ్జరీ వస్తువు కాదని, దేశానికి వ్యూహాత్మక ఆస్తి అని, రాష్ట్రపతి భద్రత (రాష్ట్రపతి భద్రత)కు అవసరమని కౌన్సిల్ బావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం భారత్ ఇతర దేశాల నుంచి లగ్జరీ కారు దిగుమతిపై 28% IGST, ప్రాథమిక కస్టమ్స్ సుంకం, అదనపు సెస్‌తో సహా భారీ పన్ను భారాన్ని వేస్తుంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత అరుదైన నిర్ణయాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.

Next Story