- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం... IRGC సంచలన ప్రకటన
6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం అంటూ IRGC సంచలన ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. యుద్ధం కారణంగా మన ఇండియా పై చాలా ఎఫెక్ట్ పడుతోంది. ఇక ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. ఆరు నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధమని తాజాగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్టేట్ మీడియాకు తెలిపింది. ఇక అమెరికాతో యుద్ధం పై చర్చలకు తాము వెళ్లబోనని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో శనివారం 300 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు చాలామంది మన పౌరులు తిరిగి వస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలలో పడింది. అందుకే ప్రాణం భయంతో ఇండియాకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 52,000 మంది ఇండియా నుంచి గల్ఫ్ చేరుకున్నారు.






