ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : Prashant Kishor

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-15 06:00:01  IST  )

ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ(Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : Prashant Kishor
X

Prashant ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ(Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Elections) తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. కానీ.. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయబోయే అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించినట్లు ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 14న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది.

Next Story