CEC: మెషీన్ రీడబుల్ జాబితాపై సీఈసీ అబద్ధం చెప్పారా? ప్రశాంత్ భూషణ్ ట్వీట్ వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-08-18 13:33:49  IST  )

ఓటు చోరీ విషయంలో ఈసీ వర్సెస్ విపక్షాల మధ్య వార్ ముదురుతోంది.

CEC: మెషీన్ రీడబుల్ జాబితాపై సీఈసీ అబద్ధం చెప్పారా? ప్రశాంత్ భూషణ్ ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ల చోరీ వ్యవహారం దేశ రాజకీయాల్లో మరింత ముదురుతోంది. రాహుల్ గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఖండించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. మెషీన్ రీడబుల్ జాబితా (Machine Readable Data) వల్ల ఓటర్ల గోప్యత దెబ్బతినే అవకాశం ఉందని సుప్రీంకోర్టు 2019 లో చెప్పిందని అందువల్లో ఈ జాబితాను తాము ఇవ్వడం లేదని చెప్పారు. అయితే సీఈసీ చేసిన ఈవ్యాఖ్యలకు ఆప్ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ (Prashant Bhushan) కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశాంత్ భూషన్ ఓ పోస్టు చేశారు.

మెషీన్ రీడబుల్ వోటరల్ జాబితా ఇవ్వడం ద్వారా ప్రైవసీ ఉల్లంఘన అవుతుంది అని గతంలో సుప్రీంకోర్టులో ఈసీ వాదించింది. కానీ సప్రీంకోర్టు మాత్రం ఈసీ వాదనను ఎక్కడా అంగీకరించలేదని అన్నారు. ఈసీ బీజేపీకి తొత్తులో మారిందని ధ్వజమెత్తారు. తమకు మెషీన్ రీడబుల్ డేటా ఇస్తే దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ అంశాన్ని మరింత ఆధారాలతో బయటపెడతామని రాహుల్ గాంధీ చెబుతున్న నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లుగా ఈసీ చెబుతోందని ప్రశాంత్ భూషన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Next Story