- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prakash raj: జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు కూడా ప్రత్యేక్ష దాడులకు దిగాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) జోక్యం చేసుకుని శనివారం సాయంత్రం ఈ ఉద్రిక్తతలక బ్రేక్ వేశారు. ఇరు దేశాల నాయకులతో చర్చించి కాల్పుల విరమణ (India-Pakistan CeaseFire) ఒప్పందం కుదిర్చారు. అయితే భారత్ పాకిస్తాన్‌పై వార్ నిలిపివేయడంతో పలువురు భిన్నవాదనలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash raj) జస్ట్ ఆస్కింగ్ (#justasking) అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
'డియర్ సుప్రీం లీడర్.. అమెరికా పాకిస్థాన్‌లోకి వెళ్లి అక్కడ తలదాచుకున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను చంపినప్పుడు అది న్యాయం అంటారు. మరి భారత్ అదే చేస్తే.. కాల్పుల విరమణ ఎందుకు? ఏ ఒప్పందం మీద ఈ కాల్పుల విరమణ అంగీకరించారో చెప్పగలరా?' అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌తో ఆయన ప్రత్యక్షంగా భారత ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు వేశారు. ఉగ్రవాదంపై కఠినంగా స్పందించే అవసరముందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.






