"నా జీవితంలో అద్భుతమైన క్షణం".. సునీతా విలియమ్స్‌ను క‌లిసిన‌ ప్రకాష్‌రాజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-23 07:11:44  IST  )

ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ప్రఖ్యాత వ్యోమగామి (ఆస్ట్రోనాట్) సునీతా విలియమ్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.

నా జీవితంలో అద్భుతమైన క్షణం.. సునీతా విలియమ్స్‌ను క‌లిసిన‌ ప్రకాష్‌రాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ప్రఖ్యాత వ్యోమగామి (ఆస్ట్రోనాట్) సునీతా విలియమ్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. తన జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. మనకాలంలో ధైర్యవంతురాలైన మహిళ సునీతా విలియమ్స్ తో మాట్లాడే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇటీవలే నాసా నుంచి రిటైర్ అయిన సునీతా విలియమ్స్.. కేరళలోని కోజికోడ్ లో నిర్వహించిన లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. అంతరిక్షయానంలో సునీతా విలియమ్స్ అత్యంత ప్రతిభావంతులైన ఆస్ట్రోనాట్లలో ఒకరిగా గుర్తంపు పొందారు. 27 సంవత్సరాలపాటు నాసాలో సేవలందించిన ఆమె గతేడాది డిసెంబర్ 27న పదవీ విరమణ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవలే ప్రపంచానికి వెల్లడించారు.

Next Story