PM Modi: మా ప్రభుత్వం కూడా రాముడి బాటలోనే- మోడీ

by Shamantha N |

“ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతాం” అని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వ్యాఖ్యానించారు. బిహార్ లోని కరకట్ లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు.

PM Modi: మా ప్రభుత్వం కూడా రాముడి బాటలోనే- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: “ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతాం” అని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వ్యాఖ్యానించారు. బిహార్ లోని కరకట్ లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. పహెల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని.. దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బిహార్‌ వచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాదులను ఊహించనివిధంగా శిక్షిస్తానని గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మోడీ మాట్లాడుతూ.. ‘‘ బిహార్ ప్రజలకు రాముడి బాట ఏంటో తెలుసు. ప్రాణం పోయినా మాట తప్పడు. మేం అదే బాటలో వెళ్తున్నాం. ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతాం. ఇదే సరికొత్త భారత్‌ విధానం. పహెల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మన అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. ఒకరోజు తర్వాత బిహార్‌ (ఏప్రిల్‌ 24న) పర్యటనకు వచ్చాను. పాక్‌లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని ఇక్కడ్నుంచే దేశానికి హామీ ఇచ్చాను. నా హామీ నెరవేర్చాకే ఇప్పుడు బిహార్‌లో అడుగుపెట్టాను.” అని అన్నారు.

సిందూరం శక్తిని చూసింది

అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్ గురించి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “పాక్ మన సోదరీమణుల సిందూరం శక్తిని చూసింది. పాక్ ఆర్మీ భద్రతలో తాము సురక్షితంగా ఉంటామని ముష్కరులు భావించారు. కానీ, ఆ దేశ సైన్యాన్ని మనం మోకరిల్లించేలా చేశాం. వారి ఎయిర్ బేస్ లు, మిలిటరీ స్థావరాలను నిమిషాల్లోనే ధ్వంసం చేశఆం. ఆపరేషన్‌ సిందూర్‌ మన అమ్ములపొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్‌ తెలుసుకోవాలి. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు.. తగ్గలేదు. మరోసారి ఉగ్రదాడి జరిగితే.. ఈసారి జరిగేది విధ్వంసమే’’ అని మోడీ చెప్పుకొచ్చారు. ఇకపోతే, రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోడీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గురువారం పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

Next Story