- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Power Outage : అంధకారంలో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్
యూరప్(Europe) దేశాలైన స్పెయిన్(Spain), పోర్చుగల్(Portugal), ఫ్రాన్స్(France) లు గాఢాంధకారంలో మునిగిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : యూరప్(Europe) దేశాలైన స్పెయిన్(Spain), పోర్చుగల్(Portugal), ఫ్రాన్స్(France) లు గాఢాంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం(Power Outage) ఏర్పడటంతో ఆయా దేశలో చీకట్లో మగ్గుతున్నాయి. కరెంటు లేకపోవడంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ఇంటర్నేషన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అనేకమంది ప్రయాణికులు మెట్రో రైల్లో చిక్కుకుపోయారని సమాచారం. ఆసుపత్రుల్లో జరగాల్సిన అత్యవసర ఆపరేషన్లు ఆగిపోయి రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు మీడియా తెలిపింది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాలు సైతం విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
యూరప్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు యూరోపియన్ విద్యుత్ గ్రిడ్(Europian Power Grid) లో నెలకొన్న సమస్య కారణంగా.. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ అంశంపై రెడ్ ఎలక్ట్రా సంస్థ స్పందించింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని, సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామని పేర్కొంది.






