Sonia Gandhi : పూర్ లేడీ..చదవలేక అలసి పోయారు : రాష్ట్రపతిపై సోనియాగాంధీ వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-31 09:29:32  IST  )

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Budget sessions of Parliament) సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) సుదీర్ఘంగా ప్రసంగించా రు. రాష్ట్రపతి ప్రసంగం(President Speech) పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ(Sonia Gandhi )ని పార్లమెంటు ఆవరణలో మీడియా స్పందించాలని కోరగా.. పూర్ లేడీ(Poor lady) పాపం చదివి చదివి అలసిపోయారని..అంతగా చదవాల్సింది కాదని వ్యాఖ్యానించారు

Sonia Gandhi : పూర్ లేడీ..చదవలేక అలసి పోయారు : రాష్ట్రపతిపై సోనియాగాంధీ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Budget sessions of Parliament) సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం(President Speech) పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ(Sonia Gandhi )ని పార్లమెంటు ఆవరణలో మీడియా స్పందించాలని కోరగా.. పూర్ లేడీ(Poor lady) పాపం చదివి చదివి అలసిపోయారని..అంతగా చదవాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ప్రసంగం చివరకు వచ్చే సరికి ఆమె మాట్లాడలేక పోయారన్నారు.

ఇక లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగం వేరీ బోరింగ్..నో కామెంట్(Boring..no comment) అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎంపీ ప్రియాంక గాంధీ మాత్రం ఏమి మాట్లాడలేదు. అయితే రాష్ట్రపతి ముర్ము ప్రసంగం పట్ల సోనియా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకత్వం తప్పుబట్టింది. రాజ్యాంగ పదవిలో ఉండి..ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించింది. బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ దీనిపై స్పందిస్తూ సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ జమిందారీ మైండ్ సెట్ ఆ విషయాన్ని అంగీకరించలేక పోతుందని అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వారు వ్యతిరేకిస్తున్నారన్నారు.

దేశ విజన్ ను తన ప్రసంగం ద్వారా వివరించిన రాష్ట్రపతిని అవమానించడం అనుచితమని మండిపడ్డారు. కాగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము ముందుగా ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాష్ట్రపతి తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు..అనుసరిస్తు్న్న విధానాలను వివరించారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని, త్వరలోనే భారత్ ప్రపంచంతో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story