- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్లను అమిత్ షా బెదిరిస్తున్నారన్న జైరాం రమేష్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ
ఈ వ్యవహారంలో వాస్తవ సమాచారాన్ని అందించాలని జైరాం రమేష్‌కు లేఖ పంపింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 150 జిల్లాల అధికారులను పిలిచి బెదిరించినట్టు ఆరోపణలు చేశారు. దీంతో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వ్యవహారంలో వాస్తవ సమాచారాన్ని అందించాలని జైరాం రమేష్‌కు లేఖ పంపింది. ఏ అధికారి కూడా అనవసరంగా ప్రభావితమైనట్టు చెప్పలేదని, అలాంటి వివరాలేమైనా ఉంటే ఇవ్వాలని, దాని ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జాతీయ పార్టీలో సీనియర్ నేతగా కౌంటింగ్ జరిగేందుకు ముందు మీరు విశ్వసిస్తున్న సమాచారం, అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని ఈసీ జైరాం రమేష్‌కు పంపిన లేఖలో పేర్కొంది. 150 మంది కలెక్టర్ల వివరాలను అందించాలని వెల్లడించింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఆరోపణలను ఖండించారు. దేశ హోం మంత్రి ఏ జిల్లా అధికారిని లేదా సబ్ డివిజనల్ అధికారిని పిలవడం జరగదు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోనే వ్యవహరిస్తారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. కాగా, శనివారం నాటి ప్రకటనలో జైరాం రమేష్ అమిత్ షాపై ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయే హోం మంత్రి కలెక్టర్లను పిలిపిస్తున్నారు. ఇప్పటివరకు 150 మందితో భేటీ అయ్యారు. ఇది అధికారులను బహిరంగంగా బెదిరించే ప్రయత్నమని, ఇలా చేయడం సిగ్గుచేటు, ఆమోదించలేమన్నారు. ఆదేశానుసారం ప్రజాస్వామ్యం పనిచేస్తుంది కానీ బెదిరింపులతో కాదు. మంగళవారం జరిగినే కౌంటింగ్‌లో ప్రధానీ మోడీ, అమిత్ షా ఇద్దరూ ఇంటికెళ్లిపోతారు. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. అధికారులెవరూ ఆందోళన చెందవద్దని, వారు రాజ్యాంగాన్ని కాపాడాలని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.






