తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కు వరుస షాక్‌లు.. ప్రచార రథం సీజ్ చేసిన పోలీసులు

by Malleboina Mahesh |

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. 2027 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కు వరుస షాక్‌లు.. ప్రచార రథం సీజ్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. 2027 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మొదటిసారి ప్రారంభించిన ఎన్నికల ప్రచారం తీవ్ర విషాదం గా మారిన విషయం తెలిసిందే. కరూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 80 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘోర సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటన అనంతరం టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల కరూర్‌లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు వేగవంతం చేయగా, మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనలో విజయ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు.

తొక్కిసలాటకు కొన్ని గంటల ముందే, విజయ్ ప్రచార రథం కింద ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు తగిలి గాయపడినట్లు సమాచారం దీనికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, విజయ్ ప్రచార రథం డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ప్రచార రథం సీజ్ చేయడం, సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో టీవీకే అధినేతకు ఇది రెండో పెద్ద షాక్‌గా మారింది. పార్టీ వర్గాలు ఈ పరిణామాలను రాజకీయ దృష్టితో చూస్తున్నా, పోలీసులు మాత్రం రెండు ఘటనలను పూర్తిగా వేర్వేరుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Next Story