- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ్గామ్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు పై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
శ్రీనగర్‌లోని పీఎస్ నవ్గామ్‌లో భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: శ్రీనగర్‌లోని నవ్గామ్ పీఎస్‌లో భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడుపై సోషల్ మీడియాలో ఉగ్రవాదుల దాడిగా చిత్రీకరిస్తూ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అలాగే పలు మీడియా, రాజకీయ నాయకులు సైతం దానిని ఉగ్రదాడిగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు నవ్గామ్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం తప్పుదారి పట్టించేలా ఉంది. శ్రీనగర్‌లోని పీఎస్ నవ్గామ్‌లో జరిగిన దురదృష్టకర ప్రమాదకర పేలుడు ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న వివిధ వార్తలు, పోస్టులు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ప్రభుత్వం ఖండించింది. ఇవన్నీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలేనని అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.
2025 నవంబర్ 14న స్వాధీనం చేసిన భారీ స్థాయి పేలుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరించే ప్రక్రియలో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు పని చేస్తున్న సమయంలో ఈ అనుకోని పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 16న విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి (హోం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఐజీ కాశ్మీర్ జోన్, జిల్లా అధికారి శ్రీనగర్, కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త సభ్యులుగా ఉన్నారు. త్వరలోనే ఈ ఘటనపై నివేదికను అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.






