మహిళలు మద్యం సేవించడంపై పోలీస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మహిళలు మద్యం సేవించడంపై పశ్చిమబెంగాల్ పోలీస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. రాణాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అధికారి లాల్తు హల్దర్ మాట్లాడుతూ.. మహిళలు బహిరంగంగా మద్యం తాగడం చూస్తుంటే సిగ్గేస్తుందని అన్నారు.

మహిళలు మద్యం సేవించడంపై పోలీస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలు మద్యం సేవించడంపై పశ్చిమబెంగాల్ పోలీస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. రాణాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అధికారి లాల్తు హల్దర్ మాట్లాడుతూ.. మహిళలు బహిరంగంగా మద్యం తాగడం చూస్తుంటే సిగ్గేస్తుందని అన్నారు. ఓ ఊరేగింపులో యువతులు రోడ్డుపై మద్యం తాగుతూ కనిపించారని చెప్పారు. అది ఊరేగింపు గొప్పతనంగా భావిస్తే తాను అలాంటి ఊరేగింపులను ఖండిస్తున్నానని చెప్పారు. పురుషులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారని వారిని అరికట్టడం మహిళల విధి అని తెలిపారు. కానీ ఇప్పుడు మహిళలే మద్యం సేవించి గందరగోళం సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఫ‌లితంగా స‌మాజం వినాశ‌నం వైపు ప‌య‌నిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. అయితే మ‌హిళ‌ల‌పై అధికారి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ఆయ‌న కామెంట్లు మ‌హిళ‌ల‌ను త‌క్క‌వ చేసేలా ఉన్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story