- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గంట’ ఎత్తుకెళ్లిన పోలీసులు.. కాంగ్రెస్ నిరసనలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్
ఇండోర్‌లో కలుషిత తాగునీటి కారణంగా మరణాలు సంభవించాయంటూ యువ కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ‘గంట’ (బెల్)తో నిరసన చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నిరసన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లో కలుషిత తాగునీటి కారణంగా మరణాలు సంభవించాయంటూ యువ కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ‘గంట’ (బెల్)తో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల నుంచి గంటను తీసుకోని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎన్డీటీవీ రిపోర్టర్‌పై మంత్రి కైలాష్ విజయవర్గీయ ‘గంట’ అనే పదాన్ని ఉపయోగించడంతో వివాదం చెలరేగింది. దీనికి నిరసనగా తీసుకున్న కాంగ్రెస్, కైలాష్ విజయ వర్గీయను ‘గంట మంత్రి’గా విమర్శించింది.
కాంగ్రెస్ నేతలు కలుషిత నీటి ఘటనకు పాలక బీజేపీ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ఆరోపిస్తూ మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, మంత్రి కైలాష్ విజయవర్గీయతో పాటు మేయర్ పుష్యమిత్ర భార్గవ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ఉద్రిక్తంగా మారడంతో ముందస్తు జాగ్రత్తగా 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రాజేష్ వ్యాస్ తెలిపారు. కలుషిత నీటితో డయేరియా వ్యాప్తి కారణంగా మరణాలు సంభవించాయన్న అంశంపై ప్రభుత్వం, మేయర్ వేర్వేరు గణాంకాలు వెల్లడించడంతో గందరగోళం కొనసాగుతోంది. కాగా, కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పోలీసులు వారి నుంచి గంట ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదే..






