- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక రోజు ఎటువంటి దాడి లేకుండానే పీఓకే భారత్‌లో కలుస్తుంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారత్ లో కలవడం పై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారత్ లో కలవడం పై కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ఒక రోజు ఎటువంటి దాడి అవసరం లేకుండానే భారత్‌లో కలిసిపోతుందని (integrated into India) నమ్మకంగా చెప్పారు. ప్రస్తుతం అక్కడ ప్రజలే స్వేచ్ఛ కోరుతున్నారని ఈ సందర్భంగా రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల క్రితం కూడా కాశ్మీర్ లోయలో జరిగిన ఒక ఆర్మీ కార్యక్రమంలో ఇదే విషయాన్ని తను అన్నానని గుర్తుచేశారు.
అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో భారత ప్రభుత్వం పీవోకేను తిరిగి తీసుకు వచ్చే "అవకాశాలు కోల్పోయింది" అని ప్రతిపక్ష పార్టీలు విమర్శించిన విషయం తెలిసిందే. కానీ రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు పీఓకే తిరిగి భారత్‌లో కలిసే రోజు దూరంలో లేదన్న నమ్మకాన్ని బలపరిచాయి. రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల అధికారిక పర్యటనలో మొరాకోలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కొత్త డిఫెన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఇది ఆఫ్రికాలో తొలి భారత రక్షణ తయారీ ప్లాంట్ కావడం విశేషం.






