- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
POK: పీవోకేకు వరదల ముప్పు
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ అధికారులకు తెలియజేయకుండా భారత్ జీలం నదిలోకి నీటిని విడుదల చేసిందని ఇస్లామాబాద్ ఆరోపించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ అధికారులకు తెలియజేయకుండా భారత్ జీలం నదిలోకి నీటిని విడుదల చేసిందని ఇస్లామాబాద్ ఆరోపించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పాకిస్తాన్ అధికారులు దీన్ని ఖండించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఇది ముజఫరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశఆరు. మసీదుల నుంచి ప్రజలను హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోఠి ప్రాంతంలో పీవోకేలోకి చేరుతుంది.
పెహల్గామ్ ఘటన
ఏప్రిల్ 22న పెహల్గామ్ లో పర్యాటకులపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. అప్పట్నుంచి సింధూ జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడం లేదని తాము నమ్మేవరకు సింధూ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేశామని వెల్లడించింది. భారత్‌లోని రిజర్వాయర్లలో పేరుకున్న బురదను తొలగించేందుకు దిగువకు నీటి విడుదలను ఈ ఒప్పందం ఆపుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే.. మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే, ఒప్పందం సస్పెన్షన్‌తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి.. నీటిని నింపుకొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. అయితే, ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దుచేసుకునే హక్కు భారత్‌కు ఉంటుంది






