- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటముల సెంచరీకి చేరువలో కాంగ్రెస్.. మోడీ ఘాటు విమర్శలు
అస్సాం పర్యటనలో కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు. ఓటముల సెంచరీకి ఆ పార్టీ దగ్గరగా ఉందంటూ నిప్పులు చెరిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజల్లో భయం పుట్టిస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. శనివారం అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతున్నారు. కాంగ్రెస్ ఓటముల సెంచరీకి చేరువలో ఉందని.. ఆ పార్టీ త్వరలోనే ఓటముల సెంచరీ పూర్తి చేసుకోబోతోందని జోస్యం చెప్పారు. గత నెలలో జరిగిన ఏఐ (AI) సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అర్ధనగ్న ప్రదర్శనను ప్రధాని ఈ సందర్భంగా తప్పుబట్టారు. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ వింత నిరసనలకు దిగుతోంది. ఏఐ సమ్మిట్‌ను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో భాగంగా బహిరంగంగా తమ బట్టలు తామే చింపుకున్నారు. ఓటమి భయంతో, తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు బట్టలు చింపుకోవడం తప్ప వేరే పని మిగిలినట్టు లేదు అంటూ ఎద్దేవా చేశారు.
హింసలోకి నెట్టారు
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్సాం యువతను హింస, ఉగ్రవాదం అనే విషవలయంలోకి నెట్టాయని మోడీ ఆరోపించారు. అసోంను కాంగ్రెస్ తన 'డివైడ్ అండ్ రూల్' పాలసీకి ప్రయోగశాలగా మార్చుకుందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన స్రవంతికి దూరం చేశారని, బరాక్ వ్యాలీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.సుమారు రూ. 24,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 24,000 కోట్లు. కాంగ్రెస్ నాయకులకు ఒక పెన్ను, కాగితం ఇచ్చి ఈ అంకెను రాయమంటే.. వారు కనీసం దాన్ని సరిగ్గా రాయలేరు కూడా అని చమత్కరించారు. కాంగ్రెస్ ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ బీజేపీ పని మొదలవుతుందని చెప్పారు.






