PM Modi: 4న మంత్రులతో ప్రధాని మోడీ సమావేశం

by S Gopi |

ప్రతిపక్షాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్‌ను వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది

PM Modi: 4న మంత్రులతో ప్రధాని మోడీ సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జూన్ 4న సాయంత్రం 4.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్ దాడి, ఆ తర్వాత ప్రతీకార చర్యలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ప్రతిపక్షాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్‌ను వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ఆపరేషన్ సిందూ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సమాధానంగానే ఇది అనుక్షణం కొనసాగుతుందని అన్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై దాడి చేసే క్రమంలో భారత్ కూడా ఫైటర్ జెట్లను కోల్పోయిందని అన్నారు. ప్రారంభంలో కొన్ని తప్పులు జరిగాయని ఆయన అంగీకరిస్తూనే, వాటిని సరిదిద్దినట్టు వెల్లడించారు. సీడీఎస్ అనిల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై పట్టు బిగించారు. అధికార బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఖర్గె ఆరోపణలు చేశారు. ఎన్నికల కోసం ప్రధాని మోడీ భారత సైన్యం పరాక్రమాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని విమర్శించారు.

Next Story