రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో భారత్ కీలకం: ఈయూ నేతలు

by Phanindra |

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో భారత్ కీలకం అని ఈయూ నేతలు అన్నారు. ఈ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాల ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో భారత్ కీలకం: ఈయూ నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-ఈయూ సంబంధాలపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లీయన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. కీలకమైన వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, ఇన్నొవేషన్, రక్షణ, భద్రత, సప్లయ్ చైన్ స్థిరత్వం తదితర అంశాల్లో ప్రగతిని ఈ నేతలు ఆహ్వానించారు. భారత్-ఈయూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం, ఐఎంఈఈసీ కారిడార్ అంశాలపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం అంతర్జాతీయంగా సుదీర్ఘమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందన్న ఉర్సుల.. ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్‌కీతో భారత్ చర్చలు కొనసాగించడాన్ని కొనియాడారు. ఈ యుద్ధాన్ని ముగించి, శాంతిని స్థాపించడంలో భారత్‌ది ముఖ్యపాత్ర అన్నారు. ఈసారి జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం కోసం ఈ ఇరువురు నేతలను భారత్‌కు రావల్సిందిగా మోడీ ఆహ్వానించారు. భారత్-ఈయూ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేందుకు ఇరువైపు నేతలు అంగీకరించారు.

Next Story